More
    BREAKING NEWS
    Loading News...
    Uncategorized

    0
    AJNEWS
    LIVE
    BREAKING
    🔴 ఆరోగ్య జ్యోతి (AJ) న్యూస్ ఛానెల్‌కి స్వాగతం     |     🔴 ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి... AJ NEWS     |     🔴 నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం...
    Homeతెలంగాణరిమ్స్‌లో మెడికల్‌ షాపుల పరిస్థితి ఏంటి?...

    రిమ్స్‌లో మెడికల్‌ షాపుల పరిస్థితి ఏంటి?…


    4 మెడికల్ షాపుల భాగస్వామ్య విధానంపై సమగ్ర విచారణకు డిమాండ్
    నివేదిక తయారు చేసింది ఎవరు?.. నిబంధనలు పాటించారా?
    దుకాణాల పరిస్థితి ఏమిటి?
    తెలంగాణలోని ఇతర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో లేని నిబంధనలు ఇక్కడే ఎందుకు?
     ఒక్కో షాపులో ఇద్దరు భాగస్వాములు.. నిబంధనలు రూపొందించింది ఎవరు?

    ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ రిమ్స్‌లోని మెడికల్ షాపుల వ్యవహారం ఇప్పుడు పలు ప్రశ్నలకు తావిస్తోంది. గతంలో మెడికల్ షాపులకు అనుమతులు ఎవరు ఇచ్చారు? ఏ నిబంధనల ప్రకారం కేటాయించారు? ప్రస్తుతం వాటిని తొలగించాలనే అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.రిమ్స్‌లో మూడు మెడికల్ షాపులకు సంబంధించి భాగస్వామ్య విధానం అమలులో ఉందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ విధానం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉందా? ఇతర ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఇదే విధానం అమల్లో ఉందా? అనే అంశాలపై ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆసుపత్రి ప్రాంగణంలో మెడికల్‌ షాపుల ఏర్పాటుకు నిర్దిష్ట విధానం ఉండాల్సి ఉన్నప్పటికీ, రిమ్స్‌లో ఏకంగా 4 షాపులకు అనుమతి ఎలా లభించింది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌, నిలోఫర్‌, ఎంజీఎం వంటి ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఇలాంటి విధానం ఉందా? అనే అంశంపై కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

    ఒక్కో షాపులో ఇద్దరు భాగస్వాములా?…
    మెడికల్‌ షాపుల నిర్వహణలో ఒక్కో షాపుకు ఇద్దరు చొప్పున భాగస్వామ్య విధానం అమలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అధికారికంగా ఈ విధానానికి అనుమతి ఉందా? ఉంటే ఏ నిబంధనల ప్రకారం అనుమతించారు? అనే విషయాలను అధికారులు ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉంది.

    భాగస్వామ్య నివేదిక ఎవరి ఆధారంగా?..
    4 మెడికల్ షాపుల భాగస్వామ్య విధానానికి సంబంధించి నివేదిక ఎవరు తయారు చేశారు? నివేదిక తయారు చేయాలని ఆదేశించింది ఎవరు? అందులో ఏ నిబంధనలను ప్రాతిపదికగా తీసుకున్నారు? నివేదికను పరిశీలించిన అధికారులు ఎవరు? అనే ప్రశ్నలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి.
    అదే విధంగా మూడు మెడికల్ దుకాణాలకు మంజూరు చేసిన సమయంలో రూపొందించిన నివేదిక ఎవరి ఆధ్వర్యంలో తయారైంది? మంజూరు ప్రక్రియలో ఎలాంటి నిబంధనలు పాటించారు? అనే అంశాలను కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
    అప్పుడు అనుమతి.. ఇప్పుడు తొలగింపు ఎందుకు?…
    గతంలో అనుమతులు ఇచ్చి, ఇప్పుడు అదే మెడికల్ షాపులను తొలగించే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది? మధ్యలో నిబంధనలు మారాయా? లేక గతంలోనే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారా? అనే అంశంపై స్పష్టత అవసరం.ఒకవేళ గతంలో తీసుకున్న నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే, కేవలం దుకాణాలను తొలగించడం మాత్రమే కాకుండా ఆ నిర్ణయానికి బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
    ఐదేళ్ల టెండర్‌లో పాల్గొన్న దుకాణాల పరిస్థితి?….
    మెడికల్ షాపుల నిర్వహణకు సంబంధించి ఐదేళ్ల  ప్రక్రియలో పాల్గొన్న దుకాణాల పరిస్థితి ఏమిటి? టెండర్ నిబంధనలు ఏమిటి? ఎంపిక ప్రక్రియ ఎలా జరిగింది? ఒప్పంద కాలపరిమితి ఎంత? ప్రస్తుతం ఆ ఒప్పందాలు అమల్లో ఉన్నాయా? అనే వివరాలను రిమ్స్ యాజమాన్యం స్పష్టం చేయాలి.
    టెండర్ ప్రక్రియ, మంజూరు ఉత్తర్వులు, ఒప్పందాలు, అద్దె చెల్లింపులు, లైసెన్సులు, భాగస్వామ్య వివరాలు, తదితర రికార్డులను సమగ్రంగా పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
    రిమ్స్‌లో నిర్ణయాలు ఎవరి ఇష్టం ప్రకారం?…
    మెడికల్ షాపులను ఏర్పాటు చేయడం నుంచి తొలగించే వరకు నిర్ణయాలు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా? లేక అధికారుల నిర్ణయాల మేరకే వ్యవహారం కొనసాగుతోందా? అనే ప్రశ్నలు రిమ్స్‌లో చర్చకు దారితీస్తున్నాయి.ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి కీలక నిర్ణయాలపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పూర్తి వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది.
    సమగ్ర విచారణకు డిమాండ్…
    మూడు మెడికల్ షాపుల మంజూరు ప్రక్రియ, భాగస్వామ్య విధానం, సంబంధిత నివేదికలు, ఐదేళ్ల టెండర్ ప్రక్రియ, ఉద్యోగుల పాత్రపై స్వతంత్రంగా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ వినిపిస్తోంది.
    విచారణలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఎలాంటి ఉల్లంఘన జరగలేదని తేలితే అదే విషయాన్ని అధికారికంగా స్పష్టం చేయాలి.

    Stay Connected
    16,985FansLike
    2,458FollowersFollow
    61,453SubscribersSubscribe
    Must Read
    Related News