More
    BREAKING NEWS
    Loading News...
    AJNEWS
    LIVE
    BREAKING
    🔴 ఆరోగ్య జ్యోతి (AJ) న్యూస్ ఛానెల్‌కి స్వాగతం     |     🔴 ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి... AJ NEWS     |     🔴 నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం...

    ఆదిలాబాద్‌

    రిమ్స్‌ అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచార

    ఎలక్ట్రికల్‌, ఫైర్‌, సివిల్‌ స్ట్రక్చర్‌ సేఫ్టీ ఆడిట్‌లు నిర్వహించాలి

    రిమ్స్‌ను 950 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తాం

    రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

    ఆదిలాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌) ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మంగళవారం రిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి, అగ్నిప్రమాదం జరిగిన నవజాత శిశు వార్డును పరిశీలించారు. ప్రమాద సమయంలో చేపట్టిన సహాయక చర్యలు, చిన్నారుల ప్రస్తుత వైద్య పరిస్థితి, చికిత్స అందుతున్న విధానం, తీసుకున్న తక్షణ చర్యలపై జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా, రిమ్స్‌ అధికారులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం రిమ్స్‌ డైరెక్టర్‌ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్‌, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, రిమ్స్‌ వైద్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, సోమవారం రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో రిమ్స్‌లోని నవజాత శిశు వార్డులో అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. ప్రాథమిక విచారణలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఏసీ యూనిట్‌లో మంటలు చెలరేగి, ఏసీకి సంబంధించిన ప్లాస్టిక్‌ భాగాలు కాలిపోవడంతో దట్టమైన పొగ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, భద్రతా ప్రమాణాల అమలులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలపై సమగ్ర విచారణ అనంతరం పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు.

    ప్రమాదం జరిగిన వెంటనే రిమ్స్‌ సిబ్బంది, జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక, పోలీసు శాఖలు సమన్వయంతో స్పందించి, చికిత్స పొందుతున్న నవజాత శిశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాయని మంత్రి తెలిపారు. విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి, ప్రభావిత చిన్నారులకు అత్యవసర వైద్య సేవలు అందించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందడం బాధాకరమని మంత్రి తెలిపారు. ప్రభావిత చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అవసరమైన చోట స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రుల సహకారాన్ని కూడా తీసుకున్నట్లు వెల్లడించారు.రిమ్స్‌లో మాతా, శిశు సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు 150 పడకల మదర్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ భవనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రసూతి సేవలు, తల్లుల సంరక్షణ, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అదనపు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

    ప్రస్తుతం రిమ్స్‌లో సుమారు 800 పడకలు ఉన్నాయని, అదనంగా 150 పడకల ఎం సి ఎచ్ భవనం ఏర్పాటు చేయడం ద్వారా రిమ్స్‌ను సుమారు 950 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రిమ్స్‌లో పలు కొత్త విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. థలసేమియా, సికిల్‌సెల్‌ అనీమియా, హిమోఫీలియా వంటి వ్యాధులకు మెరుగైన వైద్యం అందించేందుకు హెమటాలజీ విభాగం, రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవల కోసం ఎమర్జెన్సీ విభాగం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

    అదేవిధంగా రిమ్స్‌లో పీజీ వైద్య విద్యార్థుల సంఖ్య, ఓపీ, ఐపీ సేవలను పెంచడంతో పాటు పీడియాట్రిక్స్‌, గైనకాలజీ, రేడియాలజీ తదితర విభాగాల్లో పీజీ సీట్ల పెంపునకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ కోసం నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, భద్రతా లోపాలు, నిర్వహణలో లోపాలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. రిమ్స్‌లో కింది మూడు కీలక సేఫ్టీ ఆడిట్‌లను నిర్వహించాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
    ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ఆడిట్‌, ఫైర్‌ సేఫ్టీ ఆడిట్‌, సివిల్‌ స్ట్రక్చర్‌ సేఫ్టీ ఆడిట్‌ నిపుణుల కమిటీ నివేదిక, సేఫ్టీ ఆడిట్‌ల ఆధారంగా రిమ్స్‌లో అవసరమైన మరమ్మతులు, అదనపు మౌలిక వసతులు, పునరుద్ధరణ పనులు, కొత్త భవనాల నిర్మాణం, అదనపు సిబ్బంది నియామకం తదితర అంశాలపై సమగ్ర అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని మంత్రి తెలిపారు. రిమ్స్‌లో మెయింటెనెన్స్‌, మానిటరింగ్‌, భద్రతా ప్రమాణాల అమలులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తామని చెప్పారు. విచారణలో ఎవరి నిర్లక్ష్యం లేదా బాధ్యతారాహిత్యం బయటపడినా, నిబంధనల ప్రకారం తగిన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

    రిమ్స్‌లో మౌలిక వసతులను బలోపేతం చేయడం, అవసరమైన మానవ వనరులను సమకూర్చడం, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, ఆస్పత్రిలో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు.

    ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చాంగ్తూ, డీఎంఏ వాణి, జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, ఐటీడీఏ పీవో మంద మకరంద్‌, అదనపు కలెక్టర్‌ ఆర్‌.ఎస్‌. చిత్రు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష, గ్రంథాలయ చైర్మన్‌ మల్లెపూల నర్సయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, డీఎంహెచ్‌వో సాధన, వైద్యులు, అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    Stay Connected
    16,985FansLike
    2,458FollowersFollow
    61,453SubscribersSubscribe
    Must Read
    Related News