హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులైన హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ (జల మండలి) డిపార్ట్మెంట్లో కూడా తదితరులు ఇటీవల చనిపోయారు.గతంలో కూడా వివిధ శాఖలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా అకస్మాత్తుగా చనిపోయారు.చాలా దురదృష్టకరం కానీ చనిపోయిన తర్వాత రావలసిన బెనిఫిట్స్ కేంద్ర అధీనం లో ఉన్న ఈ.ఎస్.ఐ నుంచి ఇన్సూరెన్స్ మరియు పెన్షన్, అలాగే ప్రావిడెంట్ ఫండ్ నుండి కాంట్రిబ్యూషన్స్ ఈ.డి.ఎల్.ఐ ఇన్సూరెన్స్ 7 లక్షల రూపాయలు, పెన్షన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రమాద బీమా రావలసిన ఇన్సూరెన్స్ మొత్తము కుటుంబ సభ్యులకు, అతని పై ఆధారపడిన కుటుంబ సభ్యులకు అందించుటకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్సీ కోదండరాం కు తార్నాక లోని ఇంటిదగ్గర కలిసి తెలంగాణ బస్తీ దవాఖాన కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజద్ అలీ ఖాన్ వినతి పత్రం అందజేశారు. ఇట్టి బెనిఫిట్స్ కుటుంబాలకు అందించుటలో జరుగు జాప్యమును ఈ.ఎస్.ఐ ,పి.ఎఫ్, బ్యాంక్ ఇన్సూరెన్స్ ల సమన్వయ లోపాన్ని ,ఏజెన్సీల,ప్రభుత్వ అధికారుల లోపాలను పరిశీలించి అట్టి కుటుంబలకు రావలసిన బెనిఫిట్స్ మొత్తం రావలసిన ఇప్పించాలని కుటుంబ సభ్యుల లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఎక్సగ్రేషియా కూడా ఇప్పించుటకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఎమ్మెల్సీ కోదండరాం దృష్టికి తీసుకువచ్చారు.అవుట్సోర్సింగ్ ఉద్యోగ కుటుంబాలకు న్యాయం జరుగుటకు అధికారుల సమన్వయ లోపాల గురించి, ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పించుటకు అధికారుల తో మాట్లాడుతానని ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారని తెలంగాణ బస్తీ దవాఖాన కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజద్ అలీ ఖాన్ పేర్కొన్నారు.. ఇటీవల అకస్మాత్తుగా మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలంగాణ బస్తీ దవాఖాన కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంగళపాటి సుమన్, రాష్ట్ర కన్వీనర్ మెతుకు ఉప్పలయ్య, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ రౌతు నర్సింహ్మా, రాష్ట్ర సమతి సభ్యులు శాంతమ్మ, స్వప్న,అనిత,అఖిల్,మహేష్ మరియు తదితరులు తెలిపారు.
