Home Uncategorized నిమ్స్ ఆసుపత్రిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

నిమ్స్ ఆసుపత్రిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

0

అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైద్యాధికారులు, సిబ్బంది

హైదరాబాద్, నవంబర్ 26 (ఆరోగ్యజ్యోతి): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిలో గురువారం రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఐపీ బిల్లింగ్ కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన మహనీయుల చిత్రపటాల దగ్గర భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలను స్మరించుకున్నారు. రాజ్యాంగంలోని ఆశయాలు, సూత్రాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ వాటి పరిరక్షణకు కృషి చేయాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నిమ్స్ డీన్ ప్రొఫెసర్ పి. చంద్రశేఖర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారెడ్డి, లెసన్ ఆఫీసర్ రవి, మీడియా రిలేషన్ ఆఫీసర్ సత్యగౌడ్, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కేజియా, సేవా నాయక్‌తో పాటు సుజాత, రమణమ్మ, రాములు, బిడుగు శేఖర్, విద్యాసాగర్, జ్యోతి, శైలజ, తేజ, గోవింద్, సుశీల, దయాకర్, ప్రశాంత్ తదితరులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version