Home Uncategorized రిమ్స్ ఆసుపత్రి గేటు వద్ద పోలీసుల వాహన తనిఖీలు

రిమ్స్ ఆసుపత్రి గేటు వద్ద పోలీసుల వాహన తనిఖీలు

0
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 44;

ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) జనరల్ ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద పోలీసులు ప్రతిరోజూ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్టీ రమణయ్య, హెడ్ కానిస్టేబుల్ టీ. మనోహర్, కె. గణేష్ ఆధ్వర్యంలో ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ తదితర భద్రతా నిబంధనలను తనిఖీ చేస్తున్నారు. అనుమానం కలిగించే వ్యక్తుల నుంచి అవసరమైన వివరాలు సేకరిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గతంలో రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో కొన్ని వాహనాలు చోరీకి గురైన నేపథ్యంలో పోలీసులు తనిఖీలను మరింత కట్టుదిట్టం చేశారు. పోలీసుల నిరంతర నిఘా, వాహన తనిఖీలతో ఆసుపత్రి ప్రాంగణంలో వాహనాల చోరీలు తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది. రోగులు, వారి సహాయకులు, సిబ్బంది వాహనాల భద్రతకు ఈ తనిఖీలు దోహదపడుతున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version