నిమ్స్ ఆసుపత్రిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైద్యాధికారులు, సిబ్బంది హైదరాబాద్, నవంబర్ 26 (ఆరోగ్యజ్యోతి): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిలో గురువారం రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఐపీ బిల్లింగ్ కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన మహనీయుల చిత్రపటాల దగ్గర భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, సమానత్వం,...