Home తెలంగాణ ఏఎన్ఎంలకు వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై ఒకరోజు శిక్షణ

ఏఎన్ఎంలకు వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై ఒకరోజు శిక్షణ

0

మాతా శిశు ఆరోగ్యం, ఆసుపత్రి ప్రసవాలపై అవగాహన
ఇచ్చోడ, నవంబర్ 26 (ఆరోగ్యజ్యోతి): బోథ్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు గురువారం ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాతా శిశు ఆరోగ్యం (ఎంసీహెచ్), ఆసుపత్రి ప్రసవాల ప్రాధాన్యత, గర్భిణులకు అందించాల్సిన వైద్య సేవలు, అదేవిధంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్వహించాల్సిన విధులపై వైద్యాధికారులు వివరించారు.
ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ, మాతా శిశు మరణాల నివారణకు గర్భిణులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రతి గర్భిణికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించడంతో పాటు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఏఎన్ఎంలు కీలక పాత్ర పోషించాలని తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాధన, డిప్యూటీ డీఎంహెచ్ఓ జాదవ్ వినోద్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వై.సి. శ్రీనివాస్, డీఎంఓ డాక్టర్ నిలోఫర్, ఐడీఎస్పీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అశోక్, జిల్లా ప్రోగ్రాం అధికారి దేవిదాస్, ఇచ్చోడ పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్ మధురిమ, బ్రహ్మానందరెడ్డి, జాదవ్ గణేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓలు), ఏఎన్ఎంలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version