More
    BREAKING NEWS
    Loading News...
    AJNEWS
    LIVE
    BREAKING
    🔴 ఆరోగ్య జ్యోతి (AJ) న్యూస్ ఛానెల్‌కి స్వాగతం     |     🔴 ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి... AJ NEWS     |     🔴 నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం...
    HomeUncategorizedప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించాలి

    ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించాలి

     

    ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్

    స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ ఓ డీ లతో మీటింగ్ పెట్టి చెప్పిన ప్రతినెల 1వ తేదీన వేతనాలు చెల్లించడం లేదు

    హైదరాబాద్:
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన నే వేతనాలు చెల్లిస్తామని పలు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయడంతో పాటు అనేక సమావేశాల్లో హామీ ఇచ్చింది. అయితే, ఆ హామీలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ఉద్యోగుల ఆశలు ప్రతిసారి నిరాశగా మిగిలిపోతున్నాయి. నెల మొదటి తేదీన వేతనాలు అందకపోవడం వల్ల జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి కిరాయి, కరెంట్ బిల్లు,ఈఎంఐలు, పిల్లల చదువులు, నిత్యవసర వస్తువులు, కుటుంబ పోషణ కష్టంగా మారిందని తెలియజేశారు. రెండవ పీ.ఆర్.సీ సంవత్సరం దాటిన ఇంతవరకు అమలు చేయలేదు పి ఆర్ సి ఎప్పుడు ఇస్తారో కూడా క్లారిటీ లేదు కావున న్యాయమైన హక్కులు కూడా అందక ఎన్హెచ్ఎం ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్య మరియు వైద్యం ప్రక్షాళన చేయాలని ఉద్యోగుల పక్షాన కోరుతున్నాం. తెలంగాణ ప్రజలకు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు బడుగు, పేద ప్రజలకు సేవల చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నది ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు. ప్రజారోగ్యాన్ని, ప్రజలను కాపాడేందుకు అంకితభావంతో పనిచేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీననే వేతనాలు చెల్లించేవిధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న పెరిగిన వేతనాలు మరియు ఉద్యోగులకు రావాల్సిన గత ప్రభుత్వం విడుదల చేసింది ఏడు నెలల పిఆర్ సి బకాయిలు తక్షణమే చెల్లించాలని జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్హెచ్ఎం ఉద్యోగుల అందరం కలిసి ఉద్యమ కార్యాచరణ చేపట్టి, అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడబోమని ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఉద్యోగులందరి పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

    Stay Connected
    16,985FansLike
    2,458FollowersFollow
    61,453SubscribersSubscribe
    Must Read
    Related News