More
    BREAKING NEWS
    Loading News...
    AJNEWS
    LIVE
    BREAKING
    🔴 ఆరోగ్య జ్యోతి (AJ) న్యూస్ ఛానెల్‌కి స్వాగతం     |     🔴 ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి... AJ NEWS     |     🔴 నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం...
    HomeHomeకీటక జనిత వ్యాధులను అరికట్టాలి-డిస్టిక్ మలేరియా ఆఫీసర్ కే.రజిని

    కీటక జనిత వ్యాధులను అరికట్టాలి-డిస్టిక్ మలేరియా ఆఫీసర్ కే.రజిని

    వరంగల్ : వరంగల్ నగరంలోని దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పరిధిలో ఎం.హెచ్.నగర్ లో డిస్టిక్ మలేరియా ఆఫీసర్ కే. రజిని.. ఇటీవల నమోదైన కీటక జనిత వ్యాధుల దృష్ట్యా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్.భరత్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన వైద్య శిబిరాన్ని సందర్శించి ప్రజలకు కీటక జనిత వ్యాధులైన డెంగ్యూ, మలేరియా,చికున్ గునియా వ్యాధుల నివారణ పట్ల అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి కే. రజిని మాట్లాడుతూ… ప్రజలు తమ ఇంటి పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని, దోమలు కుట్టకుండా జాగ్రత్త దోమతెరలు వాడాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ప్రజలు వ్యాధుల బారున పడకుండా చూసుకోవాలని తెలిపారు. అలాగే వైద్య సిబ్బంది కాలనీలో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి జ్వర పీడితుల నుండి రక్త నమూనాలు సేకరించాలని, ప్రతి మంగళవారం మరియు శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో యాంటీ లార్వెల్ ఆపరేషన్ లు చేపట్టాలని, కీటక జనిత వ్యాధుల పట్ల ప్రజలకు చైతన్యవంతులను చేయాలని కోరారు. మున్సిపల్ సిబ్బంది సహకారంతో సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్.టీ.భరత్ కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ కుమారస్వామి, హెచ్.ఈ.ఓ సదానందం, హెల్త్ అసిస్టెంట్ కుమార స్వామి, పబ్లిక్ హెల్త్ మేనేజర్ జన్ను కోర్నెల్ మరియు ఏఎన్ఎం ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

    Stay Connected
    16,985FansLike
    2,458FollowersFollow
    61,453SubscribersSubscribe
    Must Read
    Related News