More
    BREAKING NEWS
    Loading News...
    AJNEWS
    LIVE
    BREAKING
    🔴 ఆరోగ్య జ్యోతి (AJ) న్యూస్ ఛానెల్‌కి స్వాగతం     |     🔴 ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి... AJ NEWS     |     🔴 నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం...
    Homeఉద్యోగాలుకాంట్రాక్ట్ ఉద్యోగాలు10 విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల

    10 విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల

     

    డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీ ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) మరో 10 స్పెషాలిటీ విభాగాలకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మంగళవారం విడుదల చేసింది.

    డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను అధిగమించి, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మొత్తం 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.ఇందులో అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ తదితర విభాగాలకు సంబంధించిన 692 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.
    జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ విభాగాలకు సంబంధించిన మరో 500 పోస్టుల భర్తీ ప్రక్రియను ఇటీవలే బోర్డు పూర్తి చేసింది. దీంతో ఇప్పటివరకు 1,192 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది.తాజాగా ఆప్తాల్మాలజీ, ఈఎన్‌టీ, పాథాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ విభాగాల్లోని సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టులను బోర్డు మంగళవారం విడుదల చేసింది.ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా నోటిఫై చేసిన ఖాళీలకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపిక చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను MHSRB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

    ఆగస్టు 13, 14న సర్టిఫికెట్ వెరిఫికేషన్

    ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో పేర్కొన్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఆగస్టు 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వెంగల్‌రావునగర్‌లో నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది.ఏదైనా కారణంతో నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కాలేని అభ్యర్థులు, అలాగే పెండింగ్‌లో ఉన్న ధ్రువపత్రాలను సమర్పించాల్సిన అభ్యర్థుల కోసం ఆగస్టు 17వ తేదీని రిజర్వ్ డేగా నిర్ణయించారు.అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ప్రతి సర్టిఫికెట్‌కు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని బోర్డు సూచించింది. ఆధార్, డేట్ ఆఫ్ బర్త్‌కు సంబంధించిన ఎస్‌ఎస్‌సీ లేదా ఈక్వల్ సర్టిఫికెట్, కమ్యూనిటీ/కుల ధ్రువీకరణ పత్రం తదితర ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా, వెరిఫికేషన్ షెడ్యూల్‌తో పాటు పూర్తి వివరాలను MHSRB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత లేకుండా చూడాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 1,616 పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టగా, ఇప్పటికే 1,192 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన పోస్టుల భ

    Stay Connected
    16,985FansLike
    2,458FollowersFollow
    61,453SubscribersSubscribe
    Must Read
    Related News