ఎంజీఎం సూపరింటెండెంట్ రామ్ కుమార్‌కు మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సంఘం ప్రతినిధులు
వరంగల్, ఆగస్టు 13 (ఆరోగ్య జ్యోతి): వరంగల్‌లోని ప్రతిష్టాత్మక ఎంజీఎం ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రామ్ కుమార్‌ను జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ కుమార్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై ప్రతినిధులు సూపరింటెండెంట్‌తో చర్చించారు. ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కుమార్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, వైద్య సేవల నాణ్యతను మరింత పెంచడం లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ ముద్దసాని శ్రీనివాస్, ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆచంట అభిషేక్, హనుమకొండ జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు వేల్పుల సారంగపాణి యాదవ్, పంకేర్ల కుమారస్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
