Home తెలంగాణ రిమ్స్ ఆదిలాబాద్‌లో టీ-జూడా నూతన కార్యవర్గం ఏర్పాటుఅధ్యక్షుడిగా డా. ఎం. హర్షవర్ధన్.. ప్రధాన కార్యదర్శులుగా డా....

రిమ్స్ ఆదిలాబాద్‌లో టీ-జూడా నూతన కార్యవర్గం ఏర్పాటుఅధ్యక్షుడిగా డా. ఎం. హర్షవర్ధన్.. ప్రధాన కార్యదర్శులుగా డా. పి. ఆకాంక్ష, డా. సంజీత్ రావు ఎన్నిక

0

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆదిలాబాద్‌కు అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) 2026–2027 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. నూతన అధ్యక్షుడిగా డా. ఎం. హర్షవర్ధన్ (ఎండీ, పీఎస్ఎం), ప్రధాన కార్యదర్శులుగా డా. పి. ఆకాంక్ష (ఎంఎస్, ఆప్తాల్మాలజీ), డా. సంజీత్ రావు (ఎంఎస్, జనరల్ సర్జరీ) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా డా. బి.ఆర్.ఎన్. సాయికిరణ్, డా. పి. క్రాంతి కుమార్, ప్రవక్తలుగా డా. సి.హెచ్. సుశీల, డా. ఎం. అనిషా బాధ్యతలు చేపట్టనున్నారు. సంయుక్త కార్యదర్శులుగా డా. ఎం. వివేక్, డా. ఎం. హృషీకేశ్, డా. డి. వినోద్, డా. జి. ప్రసూన, డా. జి. తేజశ్రీ, కోశాధికారిగా డా. బి. ప్రియాంక, నిర్వహణ కార్యదర్శులుగా డా. బి. సంగీత, డా. కె. దీక్షిత, డా. మణితేజ నియమితులయ్యారు. సలహా మండలి సభ్యులుగా డా. ఇ. అన్వేష్ కుమార్, డా. అభినయ్ సకాని, డా. ఎ. లోకేశ్వర్, డా. పి. నిఖిల వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి అభినందనలు వెల్లువెత్తాయి. జూనియర్ డాక్టర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా నూతన కార్యవర్గం పనిచేయనుంది. రిమ్స్ యాజమాన్యంతో సమన్వయం చేసుకుంటూ వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంతో పాటు, సానుకూల కార్యక్రమాల ద్వారా జూనియర్ డాక్టర్ల ఐక్యతను బలోపేతం చేయాలని నూతన కార్యవర్గం సంకల్పించింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version