Home తెలంగాణ రిమ్స్ రేడియాలజిస్ట్ గా డాక్టర్ శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ

రిమ్స్ రేడియాలజిస్ట్ గా డాక్టర్ శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ

0

రిమ్స్‌లో రేడియాలజిస్ట్‌గా డాక్టర్ శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ

రేడియాలజీ విభాగంలో వైద్య సేవలకు కొరత తీరే అవకాశం

ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) జనరల్ ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా డాక్టర్ శ్రీకాంత్ రేడియాలజిస్ట్‌గా శనివారం విధుల్లో చేరారు. గతంలో అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేసిన ఆయన, ఉన్నత వైద్య విద్యను అభ్యసించేందుకు గాంధీ వైద్య కళాశాలలో పీజీ ప్రవేశం పొందారు. ఇటీవల రేడియాలజీ విభాగంలో పీజీ పూర్తి చేసి వైద్య సేవలకు సిద్ధమయ్యారు. తొలుత తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీకాంత్‌ను రిమ్స్‌లో రేడియాలజిస్టుల కొరతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాధన తాంసి నుంచి రిలీవ్ చేసి రిమ్స్‌కు కేటాయించారు. ఈ మేరకు ఆయన రిమ్స్ జనరల్ ఆసుపత్రిలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. రిమ్స్ ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో వైద్యుల కొరత ఉన్న నేపథ్యంలో తనకు ఇక్కడ విధులు నిర్వహించే అవకాశం కల్పించారని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు రేడియాలజీ సంబంధిత పరీక్షలు, వైద్య సేవలు అందించడంలో తన వంతు కృషి చేస్తానని, రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఆయన రిమ్స్‌లో విధుల్లో చేరడంతో రేడియాలజీ విభాగంలో వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని రోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version