Home తెలంగాణ నూతన రిమ్స్ డైరెక్టర్ డా. బలరాం చిక్టేకు ఘన సన్మానం

నూతన రిమ్స్ డైరెక్టర్ డా. బలరాం చిక్టేకు ఘన సన్మానం

0

నూతన రిమ్స్ డైరెక్టర్ డా. బలరాం చిక్టేకు ఘన సన్మానం

యువజన సంఘాల నాయకులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్ల అభినందనలు

ఆదిలాబాద్, (ఆరోగ్య జ్యోతి): ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి నూతన డైరెక్టర్‌గా నియమితులైన డా. బలరాం చిక్టేను యువజన సంఘాల నాయకులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) లైఫ్ మెంబర్లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడు బాలశంకర్ కృష్ణ పాల్గొని నూతన డైరెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందిస్తూ అందించిన మెమొంటోను డా. బలరాం చిక్టేకు అందజేశారు. నూతన డైరెక్టర్ నాయకత్వంలో రిమ్స్ ఆసుపత్రి మరింత అభివృద్ధి సాధించి, పేద, బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల సమితి సభ్యులు, రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్లు ఠాకూర్ రాణా ప్రతాప్ సింగ్, షేక్ మాసూద్, తల్లల అశోక్, గణేష్ వర్మ, సవీన్ రెడ్డి, అజీజ్, పాసపుల రాజు, రాజు పాటుడే, అహ్మద్ తబ్రీజ్, లింగంపల్లి నర్సింహులు, ఉత్తర్వార్ గణేష్, జాదవ్ మిలింద్, రాహుల్ కంబల్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version