More
    BREAKING NEWS
    Loading News...
    AJNEWS
    LIVE
    BREAKING
    🔴 ఆరోగ్య జ్యోతి (AJ) న్యూస్ ఛానెల్‌కి స్వాగతం     |     🔴 ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి... AJ NEWS     |     🔴 నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం...
    Homeతెలంగాణఆరోగ్యశాఖలో 1,931 ఉద్యోగాలకు మెరిట్‌ జాబితా విడుదల

    ఆరోగ్యశాఖలో 1,931 ఉద్యోగాలకు మెరిట్‌ జాబితా విడుదల

    ఆరోగ్యశాఖలో 1,931 ఉద్యోగాలకు మెరిట్‌ జాబితా విడుదల
    మహిళా ఆరోగ్య సహాయకుల పోస్టులకు తుది దశకు నియామక ప్రక్రియ
    హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1,(ఆరోగ్యజ్యోతి):  ఆరోగ్యశాఖలో మరో భారీ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 1,931 బహుళ ప్రయోజన ఆరోగ్య సహాయకుల పోస్టులకు సంబంధించి వైద్య, ఆరోగ్య సేవల నియామక మండలి మంగళవారం తాత్కాలిక మెరిట్‌ జాబితాను విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు 1.25 మంది చొప్పున అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేసినట్లు మండలి వెల్లడించింది.
    ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్‌ 16 నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్‌ వెంగల్‌రావ్‌నగర్‌లోని భారతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంస్థలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.

    నిర్ణీత తేదీల్లో హాజరు కాలేని లేదా ధ్రువపత్రాలు సమర్పించలేని అభ్యర్థుల కోసం సెప్టెంబర్‌ 28వ తేదీని ప్రత్యామ్నాయంగా కేటాయించారు.అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయంలో అవసరమైన అసలు ధ్రువపత్రాలతో పాటు ప్రతి ధ్రువపత్రానికి రెండు జతల ప్రతులను తీసుకురావాలని మండలి సూచించింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితా, ఎంపిక జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
    ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, నర్సింగ్‌ అధికారులు, ఇతర వైద్య సిబ్బంది నియామకాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. గత రెండున్నరేళ్లలో ఆరోగ్యశాఖలో 15 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయగా, మరో సుమారు 2 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.

    Stay Connected
    16,985FansLike
    2,458FollowersFollow
    61,453SubscribersSubscribe
    Must Read
    Related News