ఆదిలాబాద్ ఆరోగ్య జ్యోతి: రాంనగర్‌లోని రేషన్ షాపులో 10వ, 11వ వార్డులకు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులకు చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. స్మార్ట్ రేషన్ కార్డులను 11వ వార్డు కౌన్సిలర్ తీగల అంజలి–అనిల్ ,రాంపెళ్లి శ్వేత–సతీష్ యాదవ్ దంపతులు తమ చేతుల మీదుగా అందజేశారు.ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయడంతో పాటు, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా స్మార్ట్ రేషన్ కార్డులు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత పెంచడంతో పాటు లబ్ధిదారుల వివరాలు సక్రమంగా నమోదు చేసేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు దోహదపడతాయని తెలిపారు.
కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ తీగల అంజలి–అనిల్, 10వ వార్డు కౌన్సిలర్, రాంపెళ్లి శ్వేత–సతీష్ యాదవ్‌లతో పాటు ప్రశాంత్ రెడ్డి, నవీన్, షాప్ప మరప రాజు, అభిలాష్ రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు అందేలా చర్యలు కొనసాగించాలని స్థానికులు కోరారు.
