More
    BREAKING NEWS
    Loading News...
    AJNEWS
    LIVE
    BREAKING
    🔴 ఆరోగ్య జ్యోతి (AJ) న్యూస్ ఛానెల్‌కి స్వాగతం     |     🔴 ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి... AJ NEWS     |     🔴 నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం...
    HomeUncategorizedకుక్క కాటే కాదు.. ఈ జంతువులు కరిచినా ప్రాణాపాయమే!

    కుక్క కాటే కాదు.. ఈ జంతువులు కరిచినా ప్రాణాపాయమే!

     వెబ్‌ డెస్క్‌: ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా కుక్క కాటుతో రేబిస్‌ సోకి మరణించారు అనే వార్తాలు చూస్తూనే ఉంటున్నాం. ఈ మధ్య వీధి కుక్కల దాడుల్లో చాలా మంది గాయపడటం.. కొందరైతే ప్రాణాలు కొల్పోయిన ఘటనలు కూడా ఎక్కువే. అయితే ఈ రేబిస్‌ అనేది కుక్క కరిస్తినే వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదట.. కుక్కలతో పాటు పిల్లులు, కోతులు, నక్కలు, గబ్బిలాలు వంటి జంతువులు కరిచినా లేదా గీరినా ఈ వైరస్‌ మనుషులకు సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలిపారు. రేబిస్‌ లక్షణాలు ఒకసారి కనిపించడం ప్రారంభమైతే దాదాపు ప్రాణాలు కాపాడటం చాలా కష్టమని హెచ్చరిస్తున్నారు. అందుకే ఏదైనా జంతువు కాటు, గాయం చేసిన వెంటనే సరైన చికిత్స తీసుకోవడం అత్యంత కీలకమని సూచిస్తున్నారు.

    రేబిస్‌ ఎలా వ్యాపిస్తుంది?

    రేబిస్‌ వైరస్‌ సోకిన జంతువుల లాలాజలంలో ఉంటుంది. అలాంటి జంతువు మనిషిని కరిచినా.. గీరినా.. అప్పటికే ఉన్న గాయంపై లాలాజలం తగిలినా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ వైరస్‌ నరాల ద్వారా మెదడుకు చేరి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది.

    కేవలం కుక్కలే కాదు.. ఈ జంతువులు కూడా ప్రమాదకరం

    -వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు
    -పిల్లులు
    -కోతులు
    -గబ్బిలాలు
    -నక్కలు
    -తోడేళ్లు
    -ఇతర అడవి మాంసాహార జంతువులు
    ఈ జంతువులు కరిచినా.. గీరినా రేబిస్‌ సోకే ప్రమాదం ఉంటుంది.

    రేబిస్ లక్షణాలు ఏమిటి?


    మొదటి దశ (ప్రారంభ లక్షణాలు):
    రేబిస్ లక్షణాలు వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే కనిపించకపోవచ్చు. సాధారణంగా కుక్క లేదా ఇతర జంతువు కాటు వేసిన కొన్ని రోజుల నుండి కొన్ని నెలల తర్వాత కూడా ఇవి బయటపడవచ్చు.

    https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-2416746649538951&output=html&h=280&num_ads=1&adk=444485301&adf=344783399&abgtt=6&w=742&fwrn=4&fwrnh=100&lmt=1783843149&rafmt=1&armr=3&sem=mc&pwprc=8187298469&ad_type=text_image&format=742×280&url=https%3A%2F%2Fprabhanews.com%2Frabies-not-just-a-dog-bite-these-animals-can-be-fatal-if-they-bite%2F&fwr=0&pra=3&rh=186&rw=741&rpe=1&resp_fmts=3&asro=0&aimartd=4&aieuf=1&aicrs=1&fa=27&uach=WyJXaW5kb3dzIiwiMTkuMC4wIiwieDg2IiwiIiwiMTUwLjAuNzg3MS4xMDEiLG51bGwsMCxudWxsLCI2NCIsW1siTm90O0E9QnJhbmQiLCI4LjAuMC4wIl0sWyJDaHJvbWl1bSIsIjE1MC4wLjc4NzEuMTAxIl0sWyJHb29nbGUgQ2hyb21lIiwiMTUwLjAuNzg3MS4xMDEiXV0sMF0.&dt=1783843149691&bpp=1&bdt=502&idt=-M&shv=r20260709&mjsv=m202607070101&ptt=9&saldr=aa&abxe=1&cookie_enabled=1&eo_id_str=ID%3Dfe0e3257061352f6%3AT%3D1780622742%3ART%3D1783843094%3AS%3DAA-AfjbIhai6DMRbVL6fwrOeYwyq&prev_fmts=0x0%2C728x90%2C742x280&nras=3&correlator=5403586505159&frm=20&pv=1&u_tz=330&u_his=6&u_h=900&u_w=1440&u_ah=852&u_aw=1440&u_cd=24&u_sd=1&dmc=8&adx=149&ady=1985&biw=1425&bih=765&scr_x=0&scr_y=0&eid=42533293&oid=2&pvsid=8192758447202189&tmod=1291253854&uas=1&nvt=6&ref=https%3A%2F%2Fprabhanews.com%2Fcategory%2Fhealth%2F&fc=1408&brdim=0%2C0%2C0%2C0%2C1440%2C0%2C1440%2C852%2C1440%2C765&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=128&bc=31&bz=1&pgls=CAEaAzcuMA..~CAEQBBoHMS4xODAuMA..~CAEQBRoFNC4xLjM.&ifi=5&uci=a!5&btvi=2&fsb=1&dtd=15

    ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

    జంతువు కాటు వేసిన చోట మంటగా ఉండటం, లేదా సూదులతో గుచ్చినట్లుగా అనిపించడం జరుగుతుంది. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే వైరస్ తీవ్రత వేగంగా పెరుగుతుంది.

    రెండవ దశ (తీవ్రమైన లక్షణాలు):
    ఈ దశలో వైరస్ కేంద్ర నరాల వ్యవస్థకు (మెదడుకు) చేరుకుంటుంది. దీనివల్ల క్రింది తీవ్రమైన సమస్యలు వస్తాయి:

    హైడ్రోఫోబియా: నీటిని చూసినా లేదా తాగాలని ప్రయత్నించినా తీవ్రమైన భయం వేస్తుంది.

    ఎరోఫోబియా: కనీసం గాలి తగిలినా కూడా శరీరం ఇబ్బందికి గురవుతుంది.

    కండరాలు బిగుసుకుపోవడం, తీవ్రమైన ఆందోళన, గందరగోళం (confusion) ఏర్పడతాయి. కొన్ని సమయాల్లో వ్యాధి సోకిన వ్యక్తి తీవ్రమైన పిచ్చితో ప్రవర్తించడం వల్ల వారిని అదుపు చేయడం కూడా కష్టమవుతుంది.

    https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-2416746649538951&output=html&h=280&num_ads=1&adk=444485301&adf=576079946&abgtt=6&w=742&fwrn=4&fwrnh=100&lmt=1783843149&rafmt=1&armr=3&sem=mc&pwprc=8187298469&ad_type=text_image&format=742×280&url=https%3A%2F%2Fprabhanews.com%2Frabies-not-just-a-dog-bite-these-animals-can-be-fatal-if-they-bite%2F&fwr=0&pra=3&rh=186&rw=741&rpe=1&resp_fmts=3&asro=0&aimartd=4&aieuf=1&aicrs=1&fa=27&uach=WyJXaW5kb3dzIiwiMTkuMC4wIiwieDg2IiwiIiwiMTUwLjAuNzg3MS4xMDEiLG51bGwsMCxudWxsLCI2NCIsW1siTm90O0E9QnJhbmQiLCI4LjAuMC4wIl0sWyJDaHJvbWl1bSIsIjE1MC4wLjc4NzEuMTAxIl0sWyJHb29nbGUgQ2hyb21lIiwiMTUwLjAuNzg3MS4xMDEiXV0sMF0.&dt=1783843149691&bpp=1&bdt=502&idt=1&shv=r20260709&mjsv=m202607070101&ptt=9&saldr=aa&abxe=1&cookie_enabled=1&eo_id_str=ID%3Dfe0e3257061352f6%3AT%3D1780622742%3ART%3D1783843094%3AS%3DAA-AfjbIhai6DMRbVL6fwrOeYwyq&prev_fmts=0x0%2C728x90%2C742x280%2C742x280&nras=4&correlator=5403586505159&frm=20&pv=1&u_tz=330&u_his=6&u_h=900&u_w=1440&u_ah=852&u_aw=1440&u_cd=24&u_sd=1&dmc=8&adx=149&ady=2697&biw=1425&bih=765&scr_x=0&scr_y=0&eid=42533293&oid=2&pvsid=8192758447202189&tmod=1291253854&uas=1&nvt=6&ref=https%3A%2F%2Fprabhanews.com%2Fcategory%2Fhealth%2F&fc=1408&brdim=0%2C0%2C0%2C0%2C1440%2C0%2C1440%2C852%2C1440%2C765&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=128&bc=31&bz=1&pgls=CAEaAzcuMA..~CAEQBBoHMS4xODAuMA..~CAEQBRoFNC4xLjM.&ifi=6&uci=a!6&btvi=3&fsb=1&dtd=18

    చివరి దశలో పక్షవాతం రావడం లేదా ఫిట్స్ (సొమ్మసిల్లి పడిపోవడం) రావడం జరుగుతుంది. వైరస్ పూర్తిగా మెదడుకు చేరడంతో వ్యక్తి కోమాలోకి వెళ్లి, చివరికి మరణానికి దారితీస్తుంది.

    కరిస్తే వెంటనే ఏం చేయాలి?

    -జంతువు కరిచిన వెంటనే భయపడకుండా ఈ చర్యలు తీసుకోవాలి.
    -గాయాన్ని కనీసం 15 నిమిషాల పాటు సబ్బు, శుభ్రమైన నీటితో బాగా కడగాలి.
    -యాంటీసెప్టిక్‌ ద్రావణంతో శుభ్రం చేయాలి.
    -గాయానికి పసుపు, కాఫీ పొడి, మట్టి లేదా ఇతర ఇంటి చిట్కాలు రాయకూడదు.
    -వీలైనంత త్వరగా సమీప ఆస్పత్రికి వెళ్లాలి.
    -వైద్యుల సూచన మేరకు యాంటీ-రేబిస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి.
    -తీవ్రమైన కాట్లకు రేబిస్‌ ఇమ్యూనోగ్లోబులిన్‌ (RIG) అవసరం కావచ్చు.

    రేబిస్‌ను ఎలా నివారించాలి?

    -పెంపుడు కుక్కలు, పిల్లులకు క్రమం తప్పకుండా రేబిస్‌ టీకాలు వేయించాలి.
    -వీధి జంతువులను రెచ్చగొట్టకుండా ఉండాలి.
    -పిల్లలకు జంతువులతో జాగ్రత్తగా మెలగాలని అవగాహన కల్పించాలి.
    -ఏ జంతువు కరిచినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

    నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే..

    రేబిస్‌ లక్షణాలు బయటపడిన తర్వాత చికిత్స విజయవంతం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే సరైన సమయంలో వ్యాక్సిన్‌ తీసుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు. అందుకే ఏ జంతువు కరిచినా చిన్న గాయమే కదా అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం పొందడం ప్రాణాలను కాపాడుతుంది.

    Stay Connected
    16,985FansLike
    2,458FollowersFollow
    61,453SubscribersSubscribe
    Must Read
    Related News