ఎంజీఎం సూపరింటెండెంట్ రామ్ కుమార్‌కు మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సంఘం ప్రతినిధులు

ఎంజీఎం సూపరింటెండెంట్ రామ్ కుమార్‌కు మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వరంగల్, ఆగస్టు 13 (ఆరోగ్య జ్యోతి): వరంగల్‌లోని ప్రతిష్టాత్మక ఎంజీఎం ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రామ్ కుమార్‌ను జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ కుమార్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక...