More
    BREAKING NEWS
    Loading News...
    AJNEWS
    LIVE
    BREAKING
    🔴 ఆరోగ్య జ్యోతి (AJ) న్యూస్ ఛానెల్‌కి స్వాగతం     |     🔴 ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి... AJ NEWS     |     🔴 నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం...
    HomeUncategorizedఏఎన్ఎంల ఫైనల్ మెరిట్ జాబితా విడుదల చేయాలి

    ఏఎన్ఎంల ఫైనల్ మెరిట్ జాబితా విడుదల చేయాలి

    నేడు కోఠీలో రిక్రూట్‌మెంట్ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నా

    హైదరాబాద్, నవంబర్ 25 (ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో ఏఎన్ఎం ఉద్యోగ నియామకాల ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, ఫైనల్ మెరిట్ జాబితాను విడుదల చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం (నవంబర్ 26) ఉదయం 10 గంటలకు హైదరాబాద్ కోఠీలోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు.

    2023 జూలై 26న విడుదలైన నోటిఫికేషన్ ద్వారా ఎంపీహెచ్ఏ ఫిమేల్ (ఏఎన్ఎం) పోస్టుల భర్తీకి చేపట్టిన నియామక ప్రక్రియను ఇప్పటివరకు పూర్తి చేయకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే వెరిఫికేషన్‌కు హాజరైన అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా తక్షణమే ఫైనల్ మెరిట్ జాబితాను ప్రకటించి నియామక పత్రాలు అందించాలని కోరారు. ఈ నోటిఫికేషన్ తర్వాత ఇతర కేడర్లకు సంబంధించిన నియామక ప్రక్రియలు పూర్తయినప్పటికీ ఏఎన్ఎం నియామకాల్లో జాప్యం కొనసాగుతోందని పేర్కొన్నారు.

    వైద్య ఆరోగ్య రంగంలో క్షేత్రస్థాయిలో కీలక సేవలు అందిస్తున్న ఏఎన్ఎంలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్టు పద్ధతిలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న సిబ్బందికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మూడు సంవత్సరాలుగా నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన అభ్యర్థులందరికీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు.

    ఈ ధర్నాకు వెరిఫికేషన్‌కు హాజరైన ఏఎన్ఎం అభ్యర్థులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూపాల్, రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. పసియోద్దీన్, ప్రధాన కార్యదర్శి కె. యాద నాయక్ విజ్ఞప్తి చేశారు.

    Stay Connected
    16,985FansLike
    2,458FollowersFollow
    61,453SubscribersSubscribe
    Must Read
    Related News