సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలి – రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బలరాం చిట్కే
ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బలరాం చిట్కే సూచించారు. బుధవారం ఆయన తొలిసారిగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించి వివిధ వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, మెడికల్, పారామెడికల్ సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి ఉద్యోగి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ముందుండాలని, రోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
