More
    BREAKING NEWS
    Loading News...
    AJNEWS
    LIVE
    BREAKING
    🔴 ఆరోగ్య జ్యోతి (AJ) న్యూస్ ఛానెల్‌కి స్వాగతం     |     🔴 ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి... AJ NEWS     |     🔴 నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం...
    Homeతెలంగాణబస్తీ దవాఖానాల సపోర్టింగ్ స్టాఫ్ సమస్యలు పరిష్కరించాలి

    బస్తీ దవాఖానాల సపోర్టింగ్ స్టాఫ్ సమస్యలు పరిష్కరించాలి

    హైదరాబాద్, అక్టోబర్ 24 (ఆరోగ్య జ్యోతి):* తెలంగాణలోని బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా, అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. నాలుగో తరగతి శాశ్వత ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్‌ఎం తదితర పోస్టుల భర్తీలో అనుభవజ్ఞులైన సిబ్బందికి సర్వీస్ వెయిటేజీ మార్కులు కల్పిస్తున్న తరహాలో నాలుగో తరగతి ఉద్యోగాల భర్తీలోనూ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దీర్ఘకాలంగా ఖాళీలు భర్తీ కాకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి సర్వీస్ వెయిటేజీ మార్కులతోపాటు వయోపరిమితిలో పూర్తి సడలింపు కల్పించాలని తెలంగాణ జన సమితి కార్మిక విభాగం కన్వీనర్ ఆకుల శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరారు. ఉద్యోగులకు కంటిన్యూషన్ ఆర్డర్లు జారీ చేయడంతోపాటు పెండింగ్ వేతనాలను చెల్లించాలని, ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ బస్తీ దవాఖాన కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంగళపాటి సుమన్, ప్రధాన కార్యదర్శి అంజద్ అలీఖాన్, రాష్ట్ర కన్వీనర్ మెతుకు ఉప్పలయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సిబ్బంది వేతనాల నుంచి మినహాయించిన ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని, 2018–2019 సంవత్సరం నుంచి కాంట్రాక్టు విధానంలో నియమితులైన సపోర్టింగ్ స్టాఫ్‌కు సంబంధించిన పీఎఫ్ బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన పీఎఫ్ మొత్తాలు కూడా సక్రమంగా జమయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న రక్త నమూనాల రవాణా భత్యాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. బస్తీ దవాఖానాల్లో సపోర్టింగ్ స్టాఫ్‌కు దీర్ఘకాలంగా కొనసాగుతున్న డిప్యూటేషన్ విధానాన్ని నిలిపివేసి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీలో పూర్తి అర్హతలు కలిగి ఇప్పటికే సేవలందిస్తున్న సిబ్బందికి ప్రాధాన్యత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తక్కువ వేతనాలు, వేతనాల చెల్లింపులో జాప్యం, పీఎఫ్ బకాయిలు, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి సమస్యలతో సపోర్టింగ్ స్టాఫ్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బస్తీ దవాఖాన సపోర్టింగ్ స్టాఫ్ ప్రతినిధులు రౌతు నరసింహ, అనిత, పావని, సైమన్ రాజు, భావిక, సంగీత, మహేష్, రాజు, సత్యనారాయణ, లావణ్య, సుశీల, శ్రీలత, రేణుక తదితరులు పాల్గొన్నారు.

    Stay Connected
    16,985FansLike
    2,458FollowersFollow
    61,453SubscribersSubscribe
    Must Read
    Related News