బస్తీ దవాఖానాల సపోర్టింగ్ స్టాఫ్ సమస్యలు పరిష్కరించాలి
హైదరాబాద్, అక్టోబర్ 24 (ఆరోగ్య జ్యోతి):* తెలంగాణలోని బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా, అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. నాలుగో తరగతి శాశ్వత ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, మెడికల్ ఆఫీసర్,...