More
    BREAKING NEWS
    Loading News...
    AJNEWS
    LIVE
    BREAKING
    🔴 ఆరోగ్య జ్యోతి (AJ) న్యూస్ ఛానెల్‌కి స్వాగతం     |     🔴 ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి... AJ NEWS     |     🔴 నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం...
    Homeతెలంగాణభారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డు–2026కు బొమ్మెత సుభాష్ ఎంపిక

    భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డు–2026కు బొమ్మెత సుభాష్ ఎంపిక

    అంకోలి, (ఆరోగ్యజ్యోతి): భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 95వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ సరస్వత పరిషత్, మేఘ సిటీ నవకళా వేదిక, హైదరాబాద్ వారి సౌజన్యంతో అందజేస్తున్న ప్రతిష్ఠాత్మకమైన ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డు–2026కు అంకోల్ ఆరోగ్య పర్యవేక్షకుడు బొమ్మెత సుభాష్ ఎంపికయ్యారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఆయన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. కరోనా కష్టకాలం నుంచి డాక్టర్ సుదీర్ కుమార్ తన తల్లి స్వర్గీయ గిర్మాబాయి సంగేమ్ పేరుతో నిర్వహిస్తున్న సంగేమ్ చారిటబుల్ ట్రస్ట్ ఆదివారం అన్నదాన కార్యక్రమంలో సుభాష్ పాల్గొంటూ, గత 295 ఆదివారాలుగా నిరంతరాయంగా పేదలకు అన్నదానం చేసే కార్యక్రమంలో తన వంతు సేవలందిస్తున్నారు. పేదల ఆకలి తీర్చే ఈ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు సుభాష్ తెలిపారు. గతంలో సత్య సంగీత కళానికేతన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతి, త్యాగరాయ గానసభలో నిర్వహించిన కార్యక్రమాల్లో సేవారత్న అవార్డులను అందుకొని సన్మానాలు పొందారు. అదేవిధంగా తన 26 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసాపత్రాలు, సన్మానాలు పొందారు. ఈ గుర్తింపులు తనపై మరింత బాధ్యతను పెంచాయని సుభాష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, దైవజ్ఞ శర్మ, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, డీసీపీ బద్రీనాథ్, సంగేమ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సంగేమ్ సుధీర్ కుమార్, ఫౌండర్ అనకాపల్లి మల్లికార్జునరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా శాలువాతో సన్మానం చేసి షీల్డులను అందజేశారు.

    Stay Connected
    16,985FansLike
    2,458FollowersFollow
    61,453SubscribersSubscribe
    Must Read
    Related News