మావల :- కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంలో భాగంగా వచ్చేనెల 8వ తేదీ వరకు నిర్వహించనున్న లెప్రసీ సర్వేను ఆశా కార్యకర్తలు పకడ్బందీగా చేపట్టాలని ఎయిడ్స్ అండ్ లెప్రసీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఈశ్వర్ రాజ్ అన్నారు. మంగళవారం మావల మండలంలోని దుబ్బగూ డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీరంపై పాలి పోయిన, రాగి రంగు గల మొద్దు బారిన మచ్చలు, కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు వంటి లక్షణాలు ఉన్నవారు తమ ఇంటికి వచ్చే ఆశా కార్యకర్తలకు చూపించు కోవాలని కోరారు.. సర్వే లో భాగంగా ఆశా కార్యకర్తలు ప్రతీ ఇంటిని సందర్శించాలని, అందరిని తప్పనిసరిగా పరీక్షించాలని అన్నారు. అనుమానితుల పేర్లు నమోదు చేసుకుని సంబంధిత వైద్యుల వద్దకు పంపించాలని సూచించారు…కుష్ఠు వ్యాధి ని ఏ దశలోనైనా ఎం. డి. టి. తో నయం చేయవచ్చన్నారు.. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఎం. డి. టి. చికిత్స అందుబాటులో ఉందన్నారు.. అనంతరం సర్వే ను పరీశీలించారు.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పారా మెడికల్ అధికారులు వామన్ రావ్, రమేష్ ఆరోగ్య పర్యవేక్షకులు బొమ్మెత సుభాష్, మేరీ, శకుంతల , సహాయకులు ఈశ్వర్ రెడ్డి, ప్రేమ్ సింగ్, శాంత, చంద్రకళ, తార, రిహజ్, అజిమోద్దీన్, రాజు,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
