More
    BREAKING NEWS
    Loading News...
    AJNEWS
    LIVE
    BREAKING
    🔴 ఆరోగ్య జ్యోతి (AJ) న్యూస్ ఛానెల్‌కి స్వాగతం     |     🔴 ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి... AJ NEWS     |     🔴 నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం...
    Homeతెలంగాణమాతాశిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

    మాతాశిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

    ఆదిలాబాద్, ఇచ్చోడ, (ఆరోగ్యజ్యోతి): మాతాశిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర సంకల్ప్‌ కార్యక్రమ అధికారిణి కీర్తిరెడ్డి వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. గర్భిణులు, బాలింతలకు సకాలంలో వైద్య సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. .ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సాధన, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మధు రమణ, ఎన్.హెచ్.ఎం ప్రోగ్రాం మేనేజర్ దేవదాస్ , బ్రహ్మానందరెడ్డి, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.మాతాశిశు మరణాల నివారణకు వైద్యులు, సిబ్బంది చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు అందుతున్న పరీక్షలు, ప్రసవ సేవలు, బాలింతలు మరియు చిన్నారులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.ఆసుపత్రిలో మందుల నిల్వలు, ప్రయోగశాల, బాహ్య రోగుల నమోదు వివరాలు, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు, మందులు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణులు వైద్య సేవలకు దూరం కాకుండా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రమాదకర పరిస్థితులు ఉన్న గర్భిణులను ముందుగానే గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించే ఆసుపత్రులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మాతాశిశు ఆరోగ్యంపై అవగాహన పెంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సాధన, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మధు రమణ, సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది బ్రహ్మానందరెడ్డి, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

    Stay Connected
    16,985FansLike
    2,458FollowersFollow
    61,453SubscribersSubscribe
    Must Read
    Related News