మాతాశిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ఆదిలాబాద్, ఇచ్చోడ, (ఆరోగ్యజ్యోతి): మాతాశిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర సంకల్ప్‌ కార్యక్రమ అధికారిణి కీర్తిరెడ్డి వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. గర్భిణులు, బాలింతలకు సకాలంలో వైద్య సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. .ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సాధన, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మధు రమణ, ఎన్.హెచ్.ఎం ప్రోగ్రాం మేనేజర్ దేవదాస్ , బ్రహ్మానందరెడ్డి, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.మాతాశిశు మరణాల నివారణకు వైద్యులు, సిబ్బంది చేపడుతున్న...