Home Uncategorized మహిళా భద్రతా సిబ్బందికి వేధింపుల ఆరోపణలు

మహిళా భద్రతా సిబ్బందికి వేధింపుల ఆరోపణలు

0

సూపర్‌వైజర్‌పై బాధితురాలి ఫిర్యాదు.. విచారణ చేపట్టాలని డిమాండ్
సిద్దిపేట, సెప్టెంబర్‌ 02 (ఆరోగ్య జ్యోతి): సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా భద్రతా సిబ్బందికి సంబంధించి వేధింపుల ఆరోపణలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. తనను విధుల సమయంలో ఇబ్బందులకు గురిచేస్తూ, అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపిస్తూ బాధితురాలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
తన విధులకు సంబంధించి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే వ్యక్తి కొంతకాలంగా తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పలుమార్లు ఇబ్బందులకు గురిచేయడంతో పాటు తనను మానసికంగా వేధించినట్లు ఆమె ఆరోపించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని బాధితురాలు కోరినట్లు తెలిసింది.మహిళా సిబ్బంది పనిచేసే ప్రదేశాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఫిర్యాదుపై అధికారులు నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి, ఆరోపణలు నిజమని తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఫిర్యాదులో చేసిన ఆరోపణలు విచారణలో నిర్ధారణ కావాల్సి ఉంది. సంబంధిత అధికారుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళా సిబ్బందికి సురక్షితమైన పని వాతావరణం కల్పించేందుకు ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఇలాంటి సంఘటనలు మునుముందు పునరావతం కాకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందని ఈ సందర్భంగా బాధ్యతరాలు తెలిపారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version