మహిళా భద్రతా సిబ్బందికి వేధింపుల ఆరోపణలు
సూపర్‌వైజర్‌పై బాధితురాలి ఫిర్యాదు.. విచారణ చేపట్టాలని డిమాండ్ సిద్దిపేట, సెప్టెంబర్ 02 (ఆరోగ్య జ్యోతి): సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా భద్రతా సిబ్బందికి సంబంధించి వేధింపుల ఆరోపణలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. తనను విధుల సమయంలో ఇబ్బందులకు గురిచేస్తూ, అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపిస్తూ బాధితురాలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తన విధులకు సంబంధించి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే వ్యక్తి కొంతకాలంగా తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పలుమార్లు ఇబ్బందులకు గురిచేయడంతో పాటు...