పీఎంఎస్ఎస్‌వై, సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ పోస్టుల భర్తీకి ఆదేశం
తెలంగాణ బ్యూరో,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కి ఆసుపత్రిలో కీలక పరిపాలనా పోస్టులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తు నవంబర్ 13న మెమో నంబర్ 2130/VC.2/2026-8 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. రిమ్స్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లో సూపరింటెండెంట్, పీఎంఎస్ఎస్‌వై (రిమ్స్), రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్‌ఎంఓ) పోస్టులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌లోని వైద్య విద్యా సంచాలకులను ఆదేశించారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ అక్టోబర్ 2న పంపిన లేఖను ప్రభుత్వం పరిశీలించింది. సంబంధిత పోస్టులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, తీసుకున్న చర్యలపై ప్రభుత్వానికి వెంటనే నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. రిమ్స్ లో ఆసుపత్రి నిర్వహణ, వైద్య సేవలు, పరిపాలనా వ్యవస్థపై పలు విమర్శలు, వివాదాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఈ మెమోలో కొత్తగా బాధ్యతలు చేపట్టే అధికారుల పేర్లను ప్రభుత్వం వెల్లడించలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మాత్రమే ఆదేశించింది.
