More
    BREAKING NEWS
    Loading News...
    AJNEWS
    LIVE
    BREAKING
    🔴 ఆరోగ్య జ్యోతి (AJ) న్యూస్ ఛానెల్‌కి స్వాగతం     |     🔴 ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి... AJ NEWS     |     🔴 నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం...
    Homeతెలంగాణఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి

    ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి

    వరంగల్, నవంబర్ 10 (ఆరోగ్యజ్యోతి): వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ సర్కిల్‌లో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 29వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ ప్రభుత్వం తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులరైజేషన్ చేసేంతవరకు ఉద్యోగులందరికీ 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఇకనైనా పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ టీ. భరత్ కుమార్, డాక్టర్ గుండా రవీందర్, డాక్టర్ వి. మోహన్ రావు, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ రామ్ రాజు, డాక్టర్ నిఖిల్, డాక్టర్ యశస్విని, డాక్టర్ హారిక, ఈవిన్ మేనేజర్ రవీందర్, డైకు మేనేజర్ మేర్గు అనిల్ కుమార్, నర్సింగ్ ఆఫీసర్లు మేకల మంజుల, సుమలత, కళ్యాణి, ఫార్మసీ ఆఫీసర్ నూకల అంజి యాదవ్, శివకుమార్, సతీష్ కుమార్, సంతోష్, పబ్లిక్ హెల్త్ మేనేజర్ జన్ను కార్నెల్, వైకుంఠం, అకౌంటెంట్లు కే. శ్వేత, ఎం. శ్రీనివాస్ బాబు, టీబీ విభాగానికి చెందిన రంజిత్, రాకేష్, ఏఎన్‌ఎంలు జ్యోతి, సుల్తానా, పేనీన, ఉప్పలమ్మ, శ్రీలత, ల్యాబ్ టెక్నీషియన్లు జూకంటి మౌనిక, ప్రవీణ్, ఎంఎన్‌ఓలు ఏకుల చిరంజీవి, కల్వల కుమార్, బండి రాజేష్, అజ్మీర విజయ నాయక్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

     

    Stay Connected
    16,985FansLike
    2,458FollowersFollow
    61,453SubscribersSubscribe
    Must Read
    Related News