వైద్యరోగ్య సౌకర్యాలను మెరుగుపరచాలి.
రిమ్స్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి.
బండారు రవికుమార్ సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు.
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో నెలకొని ఉన్న సమస్యల పైన అధ్యాయం చేయడానికి సిపిఎం పార్టీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు సభ్యులు బండారు రవికుమార్ రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్ లో ప్రొఫెసర్ పోస్టులు 5 అసోసియేట్ 44 ట్యూటర్ 25 అసిస్టెంట్ ప్రొఫెసర్ 13 సీనియర్ రెసిడెన్సి 21 సీఎంఓ 6 సి ఏ ఎస్ ఆర్ ఎం ఓ 4 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 115 ఖాళీలుగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య ఆరోగ్య సదుపాయాలను అందించవచ్చు అని అన్నారు. ఎనిమిది లిఫ్టులలో రెండు మాత్రమే పని చేస్తున్నా యని పేషెంట్లకు డాక్టర్లకు వైద్య ఆరోగ్య సిబ్బందికి ఇబ్బందిగా మారిందన్నారు. పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయకపోవడం 125 కేవీఏ జనరేటర్ పనిచేయకపోవడం రెండు అంబులెన్సులు పనిలో లేకపోవడం సరి కాదని అన్నారు. కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ప్రారంభించిన క్రిటికల్ కేర్ లో సిబ్బందిని నియమించకపోవడంతో క్రిటికల్ కేర్ సేవలు ప్రారంభం కాలేదని వెంటనే సిబ్బందిని నియమించి సేవలు అందించాలని డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీలో నెఫ్రాలజీ న్యూరాలజీ గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలను వెంటనే ప్రారంభించాలని ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు పెరిగిన ఎంబిబిఎస్ 50 సీట్లకు సరిపడా ఫ్యాకల్టీని నియమించాలని విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే రిమ్స్ ను సందర్శించాలని నెలకొని ఉన్న సమస్యల పరిష్కారం కార్యచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు వేతనాలు పెంచాలని అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నమొల్ల కిరణ్ జిల్లా కమిటీ సభ్యులు మంజుల,బొజ్జ ఆశన్న నాయకులు ఆరిఫా తదితరులు పాల్గొన్నారు.