More
    BREAKING NEWS
    Loading News...
    AJNEWS
    LIVE
    BREAKING
    🔴 ఆరోగ్య జ్యోతి (AJ) న్యూస్ ఛానెల్‌కి స్వాగతం     |     🔴 ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి... AJ NEWS     |     🔴 నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం...
    Homeతెలంగాణపైడిపల్లి పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

    పైడిపల్లి పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

    వైద్య సేవలు, వ్యాక్సిన్ల నిల్వపై పరిశీలన.. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఆదేశాలు
    వరంగల్, (ఆరోగ్యజ్యోతి): వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజారెడ్డి పైడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించిన ఆయన, ఏఆర్‌వీ, ఏఎస్‌వీ వ్యాక్సిన్ల లభ్యత, నిల్వ విధానం, వినియోగంపై ఆరా తీశారు.పీహెచ్‌సీ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, డ్రై డే కార్యక్రమాలతో పాటు ఫీవర్ సర్వేలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను మరింత పెంచడంతో పాటు అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించేలా పనితీరును మెరుగుపరచాలని సూచించారు.అనంతరం పైడిపల్లి పీహెచ్‌సీ పరిధిలోని పైడిపల్లి సబ్‌సెంటర్‌లో నిర్వహిస్తున్న ఔట్‌రీచ్ ఇమ్యునైజేషన్ సెషన్‌ను డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన రికార్డులు, సేవల నిర్వహణను పరిశీలించి, అర్హులైన చిన్నారులు, గర్భిణులకు నిర్ణీత సమయంలో టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని, ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని డా. బి. రాజారెడ్డి సూచించారు.

    Stay Connected
    16,985FansLike
    2,458FollowersFollow
    61,453SubscribersSubscribe
    Must Read
    Related News