More
    BREAKING NEWS
    Loading News...
    AJNEWS
    LIVE
    BREAKING
    🔴 ఆరోగ్య జ్యోతి (AJ) న్యూస్ ఛానెల్‌కి స్వాగతం     |     🔴 ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి... AJ NEWS     |     🔴 నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం...
    Homeతెలంగాణఢిల్లీ గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్‌లో తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్లకు అరుదైన అవకాశం

    ఢిల్లీ గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్‌లో తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్లకు అరుదైన అవకాశం

    జాతీయ స్థాయి వేదికపై తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ ప్రతినిధుల భాగస్వామ్యం

    న్యూఢిల్లీ / హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి): న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్–2026లో తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పాల్గొనడం రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లకు గర్వకారణంగా నిలిచిందని అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పేర్కొంది. నర్సింగ్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ వైద్య సేవలు, నర్సింగ్ విద్య, పరిశోధన, వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన అంశాలపై జాతీయ స్థాయి నిపుణులతో అభిప్రాయాలు పంచుకునేందుకు ఈ సదస్సు చక్కటి వేదికగా నిలిచిందని తెలిపింది.

    ఈ సందర్భంగా ఆల్ ఇండియా గవర్నమెంట్ నర్సెస్ ఫెడరేషన్ (ఏఐజీఎన్‌ఎఫ్‌)తో తెలంగాణ ప్రాంత ప్రభుత్వ నర్సులకు ఉన్న చారిత్రక అనుబంధాన్ని అసోసియేషన్ గుర్తుచేసుకుంది. 1988లో ఆల్ ఇండియా గవర్నమెంట్ నర్సెస్ ఫెడరేషన్ స్థాపించబడిన సమయంలో తెలంగాణ ప్రాంత ప్రభుత్వ నర్సులు వ్యవస్థాపక సభ్యులుగా భాగస్వాములయ్యారని, అప్పట్లో హైదరాబాద్ నుంచి సుమారు 100 మంది నర్సులు ఢిల్లీకి చేరుకుని తమ మద్దతు ప్రకటించారని ఏఐజీఎన్‌ఎఫ్‌ సెక్రటరీ జనరల్ అనితా పవార్ వివరించారు. దాదాపు నాలుగు దశాబ్దాల అనంతరం తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ ప్రతినిధులు మరోసారి జాతీయ స్థాయి వేదికపై పాల్గొనడం సంతోషకరమైన పరిణామమని, ప్రతినిధి బృందానికి తన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఏఐజీఎన్‌ఎఫ్‌ వ్యవస్థాపకురాలు, సీనియర్ నర్సింగ్ నాయకురాలు ఖురానా పేర్కొన్నట్లు అనితా పవార్ తెలిపారు.

    తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లలిత మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని క్లినికల్ విభాగాల్లో ప్రత్యక్షంగా రోగులకు సేవలందిస్తున్న నర్సింగ్ ఆఫీసర్లకు జాతీయ స్థాయి సదస్సులో పాల్గొనే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని కల్పించడంలో ఆల్ ఇండియా గవర్నమెంట్ నర్సెస్ ఫెడరేషన్ అందించిన సహకారం అభినందనీయమని తెలిపారు. అసోసియేషన్ కోశాధికారి స్వర్ణలత మాట్లాడుతూ, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ప్రముఖ నర్సింగ్ నాయకులను కలుసుకోవడంతో పాటు, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ కుమార్‌ను కలిసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఇలాంటి సమావేశాలు నర్సింగ్ రంగంలోని అనుభవాలు, నూతన ఆలోచనలు, అభివృద్ధి అవకాశాలను పరస్పరం పంచుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

    డిజిటల్ హెల్త్, ఆధునిక వైద్య సాంకేతికత, నర్సింగ్ విద్య, పరిశోధన, వృత్తిపరమైన నైపుణ్యాల అభివృద్ధి వంటి అంశాల్లో నర్సింగ్ ఆఫీసర్లకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నేరుగా వైద్య సేవలందిస్తున్న క్లినికల్ నర్సింగ్ ఆఫీసర్ల అనుభవం, ప్రతిభకు జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు లభించాలని ఆకాంక్షించారు.

    ఈ సదస్సులో తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రధాన కార్యదర్శి లలిత, ఉపాధ్యక్షురాలు ఆరోగ్యజ్యోతి, కోశాధికారి స్వర్ణలత, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాపోలు శేఖర్, జాయింట్ సెక్రటరీ భవానీ, కమిటీ సభ్యుడు భానవత్ క్రిష్ణ, జాయింట్ సెక్రటరీ లక్ష్మణ్ పాల్గొన్నారు. జాతీయ స్థాయి సదస్సులో పాల్గొనే అవకాశాన్ని కల్పించేందుకు సహకరించిన ఆల్ ఇండియా గవర్నమెంట్ నర్సెస్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ అనితా పవార్‌కు తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లకు భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలు లభించి, నర్సింగ్ వృత్తి మరింత అభివృద్ధి చెందాలని రాష్ట్ర కమిటీ ఆకాంక్షించింది.

    Stay Connected
    16,985FansLike
    2,458FollowersFollow
    61,453SubscribersSubscribe
    Must Read
    Related News