ఢిల్లీ గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్లో తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్లకు అరుదైన అవకాశం
జాతీయ స్థాయి వేదికపై తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ ప్రతినిధుల భాగస్వామ్యం న్యూఢిల్లీ / హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి): న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్–2026లో తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పాల్గొనడం రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లకు గర్వకారణంగా నిలిచిందని అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పేర్కొంది. నర్సింగ్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ వైద్య సేవలు, నర్సింగ్ విద్య, పరిశోధన, వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన అంశాలపై జాతీయ స్థాయి నిపుణులతో అభిప్రాయాలు పంచుకునేందుకు ఈ సదస్సు చక్కటి వేదికగా నిలిచిందని...