Home తెలంగాణ జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రిమ్స్‌ నూతన సూపరింటెండెంట్

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రిమ్స్‌ నూతన సూపరింటెండెంట్

0

ఆదిలాబాద్‌ (ఆరోగ్యజ్యోతి): రిమ్స్‌ నూతన మెడికల్‌ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ వెంకట్‌ లకావత్‌ మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ రాజర్షి షాను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పూల మొక్కను అందజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ వెంకట్‌ లకావత్‌కు కలెక్టర్‌ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రిమ్స్‌ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, ఆసుపత్రి అభివృద్ధి, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఆసుపత్రి అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి రోగులకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలని నూతన సూపరింటెండెంట్‌కు సూచించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version