Home తెలంగాణ ఫార్మసిస్టుల సమస్యలపై రాష్ట్రస్థాయి సమావేశం

ఫార్మసిస్టుల సమస్యలపై రాష్ట్రస్థాయి సమావేశం

0

తెలంగాణ,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలోని రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ఫార్మసీ వృత్తి నియంత్రణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు నూతనంగా ఎన్నికైన తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ అధ్యక్షుడితో ఈ నెల 14న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ఫార్మసిస్టులకు ఎదురవుతున్న వృత్తిపరమైన సమస్యలు, రిజిస్ట్రేషన్, ఉద్యోగ అవకాశాలు, వృత్తి పరిరక్షణ, ఫార్మసీ రంగంలో ఎదురవుతున్న సవాళ్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఫార్మసిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన అంశాలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లేందుకు సంఘాల ప్రతినిధులకు అవకాశం కల్పించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని రిజిస్టర్డ్ ఫార్మసిస్టు సంఘాల ప్రతినిధులు తప్పనిసరిగా హాజరై తమ సమస్యలు, అభిప్రాయాలు తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడు శివకుమార్ తేజావత్ కోరారు. ఈ నెల 14వ తేదీ శనివారం ఉదయం 11:30 గంటలకు డ్రగ్ కంట్రోల్ లాబొరేటరీ, టీజీ-సేఫ్‌లోని సెమినార్ హాల్‌లో సమావేశం జరగనుంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version