– హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్. ఏ. అప్పయ్య
లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం (PC&PNDT) జిల్లా స్థాయి అడ్వైసరీ కమిటీ సమావేశo ఈ రోజు హనుమకొండ కలెక్టర్ రేట్ లోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్ ప్రకారం జిల్లాలో తగ్గుతున్న బాలికల నిష్పత్తి, స్కానింగ్ సెంటర్ ల పర్యవేక్షణ, డెకాయ్ ఆపరేషన్ ల నిర్వహణ గురించి చర్చించి సభ్యుల సలహాలు స్వీకరించడం జరిగింది. లింగ వివక్షత,లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం గురించి అవగాహన కార్యక్రమాలతో పాటు చట్టం ఉల్లంగించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎంహెచ్ఓ తెలియ చేశారు. గతంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న 3 స్కానింగ్ మిషన్ లను సీజ్ చేయడం జరిగిందని ఎక్కడైనా మొబైల్ స్కానింగ్ మిషన్ లు గాని, లింగ నిర్ధారణ చేస్తున్నారని ఖచ్చితమైన సమాచారం ఉంటే 6300030940 కు తెలియ చేయాలన్నారు. ఇటీవల గౌరవ జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఖచ్చితమైన సమాచారం అందించే వారికిరూ. 50000/- ప్రోత్చహకంగా ఇవ్వడానికి నిర్ణయించడం జరిగిందని ఆయన తెలియ చేశారు. క్షేత్ర స్థాయి లో పని చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు అంగన్వాడీ టీచర్ లు అప్పటికే ఒకరు లేదా ఇద్దరు ఆడ పిల్లలను కలిగి ఉన్న వారికి అవగాహన కలిగించడమే కాకుండా వారి పై ప్రత్యేక దృశ్త్తి పెట్టాలని నిర్ణయించడం జరిగింది.మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్ సి(ఎంటిపి చట్టం )ప్రకారం గుర్తింపు పొందిన ఆసుపత్రులలో ప్రత్యేక పరిస్తితులలో చట్టం నియమాలకు లోబడి గర్భ విచ్చిత్తికి అవకాశం ఉందని, అంతే కానీ పుట్ట బోయే బిడ్డ ఆడ పిల్ల అని తెలుసుకొని అబార్షన్ కు పాల్పడటం శిక్షార్హం అని మరి ముఖ్యంగా నాటు పద్దతులు, స్వంత వైద్యo, అర్హత లేని వైద్యుల వద్ద కు వెళ్ళడం ద్వారా ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని వైద్యులు సూచించారు.ఈ సమావేశంలో జిఎంహెచ్ గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మి, పరకాల CHC సూపరింటెండెంట్ డాక్టర్ వంశీ కృష్ణ, మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రజిత, గైనకాలజిస్ట్ డాక్టర్ కవిత, డాక్టర్ రూబీన, లక్ష్యం స్వచ్ఛంద సంస్థ సీఈవో శ్రీమతి తాళ్లూరి లత, డాన్ బోస్కోస్వచ్చంధ సంస్థ ఈ.రాజు, పి. శారద, జిల్లా మాస్ మీడియా అధికారి వి. అశోక్ రెడ్డి, హెల్త్ సూపర్ వైసర్ పద్మజ, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
