రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఆరోగ్యకరమైన జీవనం కూడా కీలకం

మనిషి ఆరోగ్యంగా ఉంటేనే సుఖసంపదలు   ప్రొద్దుటూరులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు – అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ప్రొద్దుటూరు (వైఎస్సార్ జిల్లా), నవంబర్ 26 (ఆరోగ్యజ్యోతి): మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయని, ఆరోగ్యమే నిజమైన సంపద అని అంబేద్కర్ సేన రాష్ట్ర కన్వీనర్ దప్పెల్ల దేవదాసు అన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవన హక్కును కల్పించిందని, ఆ హక్కులో ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన పరిస్థితులు కూడా అంతర్భాగమని పేర్కొన్నారు....