రిమ్స్ జనరల్ ఆసుపత్రిని పరిశీలించిన డైరెక్టర్ డాక్టర్ బలరాం చిట్కే

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు – సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు అదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బలరాం చిట్కే తొలిసారిగా రిమ్స్ జనరల్ ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన వెంట రిమ్స్ ఆర్‌ఎంఓ డాక్టర్ విజయ సారథి ఉన్నారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగం నుంచి వివిధ వార్డుల వరకు పరిశీలించిన డైరెక్టర్ రోగులకు అందుతున్న వైద్య సేవలు, పరిశుభ్రత, సిబ్బంది విధుల నిర్వహణపై...