చలికాలంలో ముఖ సౌందర్యం.. చర్మ సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు!

పొడిబారడం, దురద, పెదవుల పగుళ్లకు చెక్ పెట్టండి – ఎలాంటి క్రీములు, మందులు ఉపయోగించాలి? వ్యాసకర్త: కే. పార్వతీ కుమార్, హైదరాబాద్ చలికాలం ప్రారంభమైందంటే చల్లటి గాలుల ప్రభావం మన ఆరోగ్యంపైనే కాకుండా చర్మంపైనా పడుతుంది. ముఖ్యంగా ముఖం, చేతులు, కాళ్లు, పెదవులపై చర్మం పొడిబారడం, దురద, మంట, పగుళ్లు వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. వేసవితో పోలిస్తే చలికాలంలో వాతావరణంలో తేమ తగ్గడం వల్ల చర్మం సహజంగా కలిగి ఉండే తేమను కోల్పోతుంది. దీంతో చర్మం నిర్జీవంగా కనిపించడం, ముఖంపై తెల్లటి పొలుసులు...