బసవతారకం ఆసుపత్రి క్యాన్సర్ వైద్య సేవల్లో మరో కీలక ముందడుగు..
K.NARESH (EDITOR)9848025451 హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి):క్యాన్సర్ చికిత్స, పరిశోధన, వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, న్యూఢిల్లీలోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ భాగస్వామ్యం ద్వారా రెండు ప్రముఖ క్యాన్సర్ వైద్య సంస్థలు తమ వైద్య నైపుణ్యం, పరిశోధనా సామర్థ్యం, విద్యా వనరులను పరస్పరం పంచుకోనున్నాయి. రోగులకు అత్యాధునిక చికిత్సలు అందించడం, వైద్య నిపుణులకు శిక్షణ కల్పించడం, సంయుక్త పరిశోధనలు...