More
    BREAKING NEWS
    Loading News...
    AJNEWS
    LIVE
    BREAKING
    🔴 ఆరోగ్య జ్యోతి (AJ) న్యూస్ ఛానెల్‌కి స్వాగతం     |     🔴 ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి... AJ NEWS     |     🔴 నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం...
    Homeతెలంగాణఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి

    ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి

    ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలి.. సమ్మెకు బీజేపీ నేత సిద్ధం నరేష్ పటేల్ సంపూర్ణ సంఘీభావం
    ప్రసూతి సెలవులు, ఆరోగ్య బీమా, ఉద్యోగ భద్రత కల్పించాలి
    వరంగల్, అక్టోబర్ 24 (ఆరోగ్య జ్యోతి): జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిద్ధం నరేష్ పటేల్ డిమాండ్ చేశారు. వరంగల్‌లోని పోచమ్మ మైదానంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మె శనివారానికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని సందర్శించిన సిద్ధం నరేష్ పటేల్ ఉద్యోగులకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ, జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించడం, హెల్త్ కార్డులు, ఆరోగ్య బీమా సౌకర్యాలు అందించడం, మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయడం వంటి డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్‌బీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 78 కేడర్లకు చెందిన 17,541 మంది ఉద్యోగులు జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు వంద శాతం స్థూల వేతనం చెల్లించాలని కోరారు. ఉద్యోగుల సేవలను గుర్తించి వారికి తగిన వేతనాలు, హక్కులు, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిద్ధం నరేష్ పటేల్ మాట్లాడుతూ, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేస్తున్న పోరాటం న్యాయమైనదని, వారి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి, వేతన సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజలకు వైద్య సేవలు నిరంతరాయంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దిలీప్, డాక్టర్ మోహన్, డాక్టర్ కిరణ్, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ సదానందం, డాక్టర్ మధు, డాక్టర్ ఐశ్వర్య, ఈవిన్ మేనేజర్ రవీందర్, డాక్టర్ సునీతాదేవి, డైక్ మేనేజర్ మేర్గు అనిల్ కుమార్, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ అర్చన, నర్సింగ్ ఆఫీసర్లు స్వప్న, కళ్యాణి, మంజుల, సుమలత, ఫార్మసీ ఆఫీసర్ నూకల అంజి యాదవ్, సంతోష్ కుమార్, తీగల సతీష్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్లు జూకంటి మౌనిక, చంద్ర కిరణ్, శోభ, అకౌంటెంట్లు ఆచంట అభిషేక్, ప్రేమలత, టీబీ విభాగం సిబ్బంది రంజిత్, రాకేష్, ఏఎన్‌ఎంలు జ్యోతి, సుల్తానా, పేనీన, రాజేశ్వరి, ప్రభావతి, అనిత, శ్రీలత, ఎంఎన్‌ఓలు ఏకుల చిరంజీవి, బండి రాజేష్, విజయ నాయక్‌తోపాటు పలువురు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు పాల్గొన్నారు.

    Stay Connected
    16,985FansLike
    2,458FollowersFollow
    61,453SubscribersSubscribe
    Must Read
    Related News