ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. యూసుఫ్‌కు వినతిపత్రం అందజేత కరీంనగర్, సెప్టెంబర్ 8 (ఆరోగ్యజ్యోతి): జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. గత సంవత్సరం ప్రభుత్వం పెంచిన వేతనాలను వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ఏఐటీయూసీ నాలుగో రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, కనీస వేతనాల సలహా మండలి సభ్యుడు ఎం.డి. యూసుఫ్‌కు ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర అధ్యక్షుడు...