ప్రపంచంలో మందుల కంపెనీల పుట్టుక నుంచి తెలంగాణ ఫార్మా హబ్‌

వేల ఏళ్ల ఔషధ చరిత్ర నుంచి ఆధునిక పరిశ్రమకు.. భారతదేశంలో స్వదేశీ ఔషధ తయారీకి పునాది వేసిన ఆచార్య పీసీ రే మందుల తయారీ చరిత్రను ఒకే కంపెనీ లేదా ఒకే వ్యక్తితో ప్రారంభమైందని చెప్పడం కష్టం. ప్రాచీన కాలంలో ఔషధాలను మూలికలు, ఖనిజాలు, జంతు ఉత్పత్తుల నుంచి వైద్యులు, ఔషధ నిపుణులు తయారు చేసేవారు. అయితే ఆధునిక పారిశ్రామిక ఔషధ పరిశ్రమ 19వ శతాబ్దంలో యూరప్‌, అమెరికాలో శాస్త్రీయ రసాయన శాస్త్రం అభివృద్ధి చెందడంతో వేగంగా రూపుదిద్దుకుంది. 19వ శతాబ్దం చివరి దశలో...