క్షయ నిర్మూలనలో యువత భాగస్వామ్యం కీలకం

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు యువతను భాగస్వాములను చేయడం ఎంతో అవసరమని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి. సుమలత అన్నారు. రిమ్స్ వైద్య కళాశాలలో నిర్వహించిన “క్షయ ముక్త్ అభియాన్” కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ఎన్‌సీసీ కేడెట్లకు క్షయ వ్యాధిపై ప్రత్యేక శిక్షణ, అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ సుమలత మాట్లాడుతూ.. క్షయ వ్యాధి పూర్తిగా నయం అయ్యే వ్యాధి అయినప్పటికీ, వ్యాధి లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేయడం వల్ల సమస్యలు ఎదురయ్యే...