గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణే ధ్యేయం: జిల్లా కలెక్టర్ రాజర్షిషా

అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. శనివారం ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ తండా గ్రామంలో టీబీ రహిత గిరిజన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమగ్ర ఆరోగ్య పరీక్షా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించి సందర్శించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా.సాధన, ప్రోగ్రామ్ అధికారి సుమలత,  అదనపు డీఎంహెచ్‌వో మనోహర్, డీఆర్డీవో రవీందర్, ప్రోగ్రామ్ అధికారి సుమలత, సర్పంచ్ రోహిదాస్,...