ఆయుష్ ఎస్‌ఎన్‌ఓల వేతన పెంపు ఏఐటీయూసీ పోరాటాల ఫలితం

హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి):ఆయుష్ ఎస్‌ఎన్‌ఓల వేతనం రూ.15,600కు పెంచడం ఏఐటీయూసీ పోరాటాల ఫలితమేనని నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, రెగ్యులరైజేషన్ కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని అన్నారు.