పీహెచ్‌సీల్లో రోగులకు మెరుగైన సేవలు అందించాలి

కరీమాబాద్:  గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎస్‌ఆర్‌ఆర్‌ తోట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వరంగల్జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రాజిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించి, పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవలు, వ్యాక్సినేషన్, ఏఎన్‌సీ క్లినిక్, ఇతర ఆరోగ్య కార్యక్రమాల అమలును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిత, మంజుల, మౌనిక, శ్వేత,  నూకల అంజి యాదవ్, రామ రాజేష్ ఖన్నా , గూడెపు ప్రభాకర్ మరియు కృష్ణవేణి పాల్గొన్నారు....