పల్లె దవాఖానలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
వైద్య సేవలు, రక్త పరీక్షలపై సమీక్ష.. ఔషధ నిల్వలు, రికార్డుల పరిశీలన గ్రామీణులకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమన్న కలెక్టర్ కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని మండలంలోని యానం బైలు పల్లె దవాఖానను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వైద్య సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు....