11 వైద్య కళాశాలలపై సమీక్ష

  మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష అమరావతి : రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధికి సంబంధించిన డీ-స్కోపింగ్ ప్రతిపాదనలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఉన్న మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడం, అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను ప్రాధాన్యత క్రమంలో గుర్తించడం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులను సమర్థంగా వినియోగించడంతో పాటు అవసరమైన చోట అదనపు సౌకర్యాలు కల్పించడంపై సమావేశంలో చర్చ జరిగింది. విద్యార్థులకు...